Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб HARI ITHADU HARUDU ATHADU в хорошем качестве

HARI ITHADU HARUDU ATHADU 3 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



HARI ITHADU HARUDU ATHADU

#HARI_ITHANDU_HARUDU_ATHANDU ANNAMAYYA AKSHARA VEDAM EPISODE- 43 #అన్నమయ్య_అక్షరవేదం ..సంపుటి -- 43* ( #హరిఇతండు_హరుడతండు ..ఆకారమొక్కటే..*) 🌺🙏ఓం నమో వేంకటేశాయ.🙏🌺 అందరికీ శుభ శనివారము --- ✍️ మీ వేణుగోపాల్ అన్నమయ్య అక్షర వేదం ..సంపుటి -- 43 కి శుభ స్వాగతం ..✍️ *మీ వేణుగోపాల్*.. ) 🙏శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే | శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః ||🙏 🙏శివుడే విష్ణువు, విష్ణువే శివుడు, శివుడి హృదయం ఏమిటని పరిశీలన చేస్తే విష్ణువు ఉంటాడు, విష్ణు హృదయాన్ని పరిశీలిస్తే శివుడు ఉంటాడు. శివుడు, విష్ణువు రెండుగా కనిపిస్తున్న ఒకే శక్తి. ఇద్దరూ ఒక్కటే. శివుడు నిత్యం కళ్ళు మూసుకుని విష్ణువును ధ్యానిస్తే, విష్ణువు నిత్యం శివనామస్మరణ చేస్తాడు. 🙏 వారిద్దరిని కలలో కూడా వేరుగా భావించరాదు. వేదోపనిషత్తులలో చెప్పబడిన ఈ హరి - హర ఏకత్వ తత్వమునే అన్నమాచార్యుల చక్కటి సంకీర్తనతో వివరించారు . మరి అటువంటి కీర్తన అర్ధం ఈ వారము తెలుసుకుందాము , పాడుకుని  తరించుదాము .🙏 🌺ఈయనను హరి అని కొలుస్తున్నాము .ఆయనను హరుడని వేడుకుంటున్నాము. నిజానికి హరి హరులు ఇద్దరు పరమాత్ముని రూపమే.🌺🙏 🌺వీరి ఇద్దరిలో అధికులు ఎవ్వరూ అన్న సంవాదము చేయుట అజ్గ్నానము .నిజానికి ఇద్దరూ ఒకటే అంటున్నారు అన్నమయ్య .🌺🙏 🌺విష్ణువు నిగనిగల కురులతో మనోహరంగా దర్శనమిస్తే , శివరూపములో జటాజూటముతో సుర రక్షణ గావించుచున్నాడు  హరుడు.🌺🙏 🌺విష సర్పమునే పరుపుగా చేసుకుని యోగనిద్రలో ఉంటాడు విష్ణువు .మరి విష సర్పముల మధ్యలో ధ్యాన ముద్రలో ఉంటాడు శివుడు .నిజానికి వీరు తపస్సు చేసేది ఒకరి గురించి ఇంకొకరు .🌺🙏 🌺కలువరేకుల కన్నులతో ప్రీతితో భక్తులను అనుగ్రహిస్తుంటాడు విష్ణువు . ఆ భక్తులకు రక్షణగా చిచ్చర కన్నులతో  అసురులకు భీతిగొలుపుతాడు పరమశివుడు.🌺🙏 🌺వాయువేగమును మించిన గరుడుని వాహనముగా చేసుకుని విష్ణువు లోకపాలనము చేస్తుంటే , స్థిరముగా అమిత శక్తి గలిగిన ఎద్దుపై ఊరేగుతాడు శివుడు.🌺🙏 🌺శ్రీ మహాలక్ష్మిని శ్రీహరి స్వీకరిస్తే , శ్రీ గౌరిని పరమేశ్వరుడు పాణిగ్రహణము గావించెను . ఇరు దంపతులూ గావించుచున్నది లోకకళ్యాణమే కదా.🌺🙏 🌺భూతలము మీది జీవులను విష్ణువు ఏలికచేస్తే , శితల పర్వతమున ఆసీనుడై చల్లగా అందరినీ రక్షించుచున్నాడు శివుడు.🌺🙏 🌺నవరత్నఖచిత ఆభరణములు శ్రీ హరి గళమునకు అలంకారమైతే , హాలాహలమును దాచుకున్న హరుని కంఠము సమస్త జీవరాశికీ పూజనీయమయినది.🌺🙏 🌺దివ్య శ్రీ చందన లేపనముతో విష్ణువు పులకించిపోతే, భస్మాభిషేకముతో పరమశివుడు పరవశిస్తాడు .🌺🙏 🌺గజేంద్రుని భయమును హరించిన వాడు విష్ణువైతే , గజముఖుడైన గణపతికి ఆదిగురువైనాడు శివుడు.🌺🙏 🌺సగము మనిషి రూపము సగము సింహరూపము అయిన నృసింహ రూపముతో విష్ణువు సురరక్షకుడైతే, సగము శివ రూపము సగము శక్తి రూపముతో అర్ధనారీశ్వరుడై లోక రక్షకుడయ్యాడు పరమశివుడు.🌺🙏 🌺రాక్షసులకు శత్రువు విష్ణువు ,రాక్షసులను హరించువాడు శివుడు . ( త్రిపురములను హరించెడివాడు ఆ త్రిపురాంతకూడు ) ఇద్దరిలో భేదములు ఎంచనేల??🌺🙏 🌺ఆ శ్రీ వేంకట శైల పతియైన శ్రీ వేంకటేశ్వరుడే కలియుగ దైవమై , అన్ని రూపములలో ,భక్తులను కరుణించి కటాక్షించుచున్నాడుకదా .🌺🙏 తాత్పర్య సహిత దృశ్య మాలికగా మీకు అందించాలన్ననా చిన్న ప్రయత్నమును ఆశీర్వదిస్తారని ఆశిస్తూ..దోషములున్న...మన్నించమని విన్నపము...🙏🙏 ( *అన్నమయ్య అక్షర వేదం --- సంపుటి 43*) -- ✍️ మీ వేణుగోపాల్ 🌺🌺 *సంకీర్తన*🌺🌺 హరి ఇతండు హరుడతండు ఆకారమొక్కటే హరి హరులందున అధికులెవ్వరు లేరు … మెరికురులు ఇతనికి  మరుజడలతనికి ఉరగ పరపితనికి  ఉరగములతనికి విరికన్నులితనికి  చిచ్చర కన్నులతనికి గరుడడితనికి  ఘనవృషభమతనికి !! హరి ఇతండు !! శ్రీ తరుణి ఇతనికి   శ్రీ గౌరి అతనికి భూతలంబితనికి  శీతలగము అతనికి జాతి మణులితనికి  విషమణులతనికి రీతి గంధమితనికి విభూతి పూతలతనికి !! హరి ఇతండు !! కరిభయ హరుడితడు కరిముఖ గురుడతడు నరసింహుడితడు  అర్ధనారీశ్వరుండతడు మురవైరి ఇతడు  పురహరుడతడు పరగ శ్రీ వేంకటశైలపతి ఈతడే ఆతడు !! హరి ఇతండు !!

Comments