Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб చట్టం ఉన్నవాళ్ల చుట్టంగా పనిచేస్తోంది| Rule of Law | Dr.JP (ex-IAS) & Shri.Lakshmi Narayana (ex-IPS) в хорошем качестве

చట్టం ఉన్నవాళ్ల చుట్టంగా పనిచేస్తోంది| Rule of Law | Dr.JP (ex-IAS) & Shri.Lakshmi Narayana (ex-IPS) 1 год назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



చట్టం ఉన్నవాళ్ల చుట్టంగా పనిచేస్తోంది| Rule of Law | Dr.JP (ex-IAS) & Shri.Lakshmi Narayana (ex-IPS)

#swatantrabharatavajrotsavam #jpnarayan #jdlaxminarayana "చట్టం కంటే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి సహా ఎవరూ పెద్దవాళ్లుకాదని మన దేశంలో కాగితాల మీద రాసి ఉంది గానీ, స్వతంత్రం వచ్చి ఇన్నేళ్లయినా చట్టం ఆచరణలో అధికారం, డబ్బు ఉన్నవాళ్ల చుట్టంగానే ఉంది. వేగంగా, నిష్పాక్షికంగా, సమర్థంగా, తక్కువ ఖర్చుతో న్యాయం అందటం లేదు. దీంతో కోట్లాది సామాన్యులకు భద్రత కరువవుతోంది. ఆస్తులు, ఇతర ఆర్థిక నేరాల్లో న్యాయం అందటం లేదు. కాంట్రాక్టులు సరిగా అమలవటం లేదు. హత్యలు చేసినవాళ్లు కూడా నిర్దోషులుగా విడులవుతుండగా, నిందితులుగా లక్షలమంది జైళ్లలో మగ్గుతున్నారు. స్వతంత్ర భారతంలో ఇప్పటికీ నేరాలు ఎంతోకొంత అదుపులో ఉండటానికి కారణం మన కుటుంబ వ్యవస్థ, ఇతర అంతర్గత బలాలు తప్ప చట్టబద్ధపాలన సక్రమంగా అమలవటం కాదు. పట్టణీకరణ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో కుటుంబ వ్యవస్థ, సామాజిక అనుబంధాలు కూడా బలహీనపడుతూ నేరాలు పెరుగుతున్నాయి. చట్టబద్ధపాలనను పటిష్ఠం చేయకపోతే విజృంభించే నేరాలను అదుపుచేయటం ఉన్నకొద్దీ సాంకేతికత కూడా పెరుగుతున్న రాబోయే కాలంలో అసాధ్యమవుతుంది. అప్పుడు కన్నీరు కార్చి లాభం లేదు. మోదీ ఈడీని ఉసిగొల్పుతున్నారని ఆరోపిస్తున్నారుగాని.. మేం అధికారంలోకి వస్తే చట్టబద్ధపాలన కోసం సంస్కరణలు తెస్తామని ప్రతిపక్షాలు కూడా చెప్పటం లేదు. రాజకీయ కక్ష సాధింపులకి చట్టబద్ధపాలన యంత్రాంగాల్ని పోటీపడి దుర్వినియోగం చేస్తున్నారు. అందుకే సమాజం కూడా మేలుకొని చట్టబద్ధపాలనను పబ్లిక్ డిమాండ్ గా మార్చాలి. ఈ సంస్కరణలకు పెద్ద ఖర్చుకూడా అవదు. ఇందులో ఓట్లు ఉన్నాయనుకునే స్థాయిలో ప్రభుత్వాల్ని, పార్టీల్నిప్రజలు అడగటమే ఆలస్యం. చట్టబద్ధపాలన.. పోలీసులు, లాయర్ల కోసం కాదు, ప్రజలు, ప్రజాస్వామ్యం కోసం" అని ప్రజాస్వామ్య పీఠం (FDR)/లోక్ సత్తా వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్, JD ఫౌండేషన్ వ్యవస్థాపకులు V.V లక్ష్మీనారాయణ 'స్వతంత్ర భారతం 75 - లోక్ సత్తా 25'పై పబ్లిక్ పాలసీ యువ రీసెర్చర్ సుమేధతో ఎపిసోడ్ లో అన్నారు. ప్రపంచమంతా సివిల్ కేసులు ఎక్కువ ఉంటే మన దేశంలో క్రిమినల్ కేసులు ఎక్కువగా ఉండటం, న్యాయాన్నిబట్టి కాకుండా లాయర్ల వాదనల్లో బలాన్ని బట్టి జడ్జీలు తీర్పులిస్తుండటం, పోలీసులపై ప్రజల్లో అపనమ్మకం, పోలీస్ సిబ్బందికి నేర పరిశోధన నైపుణ్యాలు, ఫోరెన్సిక్స్, ఇతర వనరుల కొరత, నేర నిరూపణ శాతం అతి తక్కువగా ఉండటం, పోలీసులు సమర్థంగా కేసు ఫైల్ చేసినా నేరం రుజువు చేయలేని బలహీన ప్రాసిక్యూషన్, అసమర్థ పాలన వల్ల చిన్న విషయాలు కూడా శాంతి భద్రతల సమస్యగా మారటం, జైలు సంస్కరణలు, యువతను డ్రగ్స్ కి బానిసల్ని చేస్తున్న నేర ముఠాలు, తక్షణ న్యాయం పేరుతో నిందితులను పోలీసులు కాల్చిచంపటం, గ్రామన్యాయాలయాల చట్టం ఇప్పటికీ అమల్లోకి రాకపోవటం, గ్రామన్యాయాలయాల్ని పట్టణ ప్రాంతాల్లో స్థానిక కోర్టులుగా విస్తరించటం, మాలిమత్ కమిటీ నివేదిక, సైబర్ నేరాలు, ఆన్ లైన్ లోన్లు, గ్యాంబ్లింగ్ దోపిడీలు, విద్వేష వ్యాఖ్యలు, సోషల్ మీడియా వల్ల కల్లోలాలు మొదలైన అంశాలపై లక్ష్మీనారాయణ, JP పరిష్కారాలతో ఈ ఎపిసోడ్ లో స్పష్టతనిచ్చారు.

Comments