Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб స్పీడ్ గా బరువుతగ్గి సన్నగా స్లిమ్ అయ్యే సింపుల్ టెక్నిక్|Dr Manthena Satyanarayana raju|GOOD HEALTH в хорошем качестве

స్పీడ్ గా బరువుతగ్గి సన్నగా స్లిమ్ అయ్యే సింపుల్ టెక్నిక్|Dr Manthena Satyanarayana raju|GOOD HEALTH 4 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



స్పీడ్ గా బరువుతగ్గి సన్నగా స్లిమ్ అయ్యే సింపుల్ టెక్నిక్|Dr Manthena Satyanarayana raju|GOOD HEALTH

#DrManthena #DrMantenaAshramam# షుగర్ 500 ఉన్నా నో మ్యాటర్.. నేను తగ్గిస్తా డా.మంతెన సత్యనారాయణ రాజు డా.మంతెన సత్యనారాయణ రాజు గారిని చూస్తే షుగర్ ఆమడ దూరం పరుగెడుతోంది. ఇది నిజంగా నిజం. చిన్నా పెద్దా తేడా లేకుండా ఇప్పుడు అందరినీ కబళిస్తున్న షుగర్ వ్యాధికి పగ్గాలేసే చాకచక్యం రాజుగారికి మాత్రమే ఉందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఒక్కసారి డయాబెటిస్ ఎటాక్ అయితే జీవిత కాలం మందులు వాడాల్సిందేనని, ఆ మందులతో ఇల్లు, ఒళ్లు గుల్ల చేసుకోవాల్సిందేనని.. ఫండమెంటలైజ్ చేసిన థియరీకి సత్యనారాయణ రాజు చెక్ పెట్టారు. 500 దాటిన షుగర్ అయినా తోకముడిచి పారిపోకతప్పని ఆహార నియమాలు (స్పెషల్ డైట్ ప్లాన్)ను రూపొందించారు. డిజిటల్ యుగంలో పుట్టుకొచ్చిన కొందరు ఆరోగ్య ప్రవక్తలు చెప్పేటి ఊసుగోలు కబురు లాంటి విషయం కాదు.. ఏమాత్రం సాధన లేకుండా చెప్పే గాలికబురు అంతకంటే కాదు.. పాతికేళ్ల పరిశీలన, పరిశోధనా అనుభవ సారం. మంతెన సత్యనారాయణ రాజు 25 ఏళ్ల క్రితం చేతికి ఓ సంచి తగిలించుకుని తెలుగు ప్రాంతంలో తిరగడం మొదలెట్టింది మొదలు.. ఇప్పటి వరకు కొన్ని వేల మంది ‘ప్రకృతి జీవన విధానం’ ఆచరిస్తూ షుగర్ ను నియంత్రణలోకి తెచ్చుకున్నారు. వారు జీవితకాలం వాడాల్సిన టాబ్లెట్లను తీసి డస్ట్ బిన్ లో వేశారు. ఉప్పు, నూనె మానేయడం ద్వారా ఆచరిస్తున్న జీవన విధానంలో.. ఎన్ని స్వీట్లు తింటున్నా వారిని ‘షుగర్’ వ్యాధి ఏమీ చేయలేకపోతోందంటే ఆ క్రెడిట్ ముమ్మాటికీ మంతెన రాజు గారిదే. ఇప్పుడు అంతా సైంటిఫిక్ యుగం. శాస్త్రీయ రుజువులు లేకుండా దేనినీ నమ్మరాదు.. సరిగ్గా సత్యనారాయణ రాజు కూడా ఇదే చెబుతారు అందరికీ.. అందుకే షుగర్ వ్యాధిపై శాస్త్రీయ పరిశోధన కూడా చేసి, తాను ప్రవచిస్తున్న విధానం నూటికి నూరు పాళ్లు నిజమని నిరూపించి జేజేలు అందుకున్నారు. 2014వ సంవత్సరంలో (మే-అక్టోబర్) ఆరు నెలల మధ్య కాలంలో డా.మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్యాలయంలో ఈ పరిశోధన జరిగింది. ఈ పరిశోధనలో 101 మంది షుగర్ వ్యాధిగ్రస్తులపై 15 రోజుల పాటు ప్రకృతి వైద్య విధానంలో ప్రయోగాలు చేశారు. ఎటువంటి మందుల్లేని ప్రకృతి చికిత్సలు, ఉప్పు, నూనెలు తీసివేసిన ఆహారం అందించారు. ఆరోగ్యాలయం సూపరింటెండెంట్ డా.బైరి శ్రీనివాసరావు నేతృత్వంలో డా.మంతెన సత్యనారాయణ రాజు గారి మార్గదర్శకత్వంలో ఈ పరిశోధన నిర్వహించారు. కేవలం 15 రోజుల పాటు ఆహార నియమాలు మార్చుకున్నందుకే 19 శాతం మందికి అంటే దాదాపు 20 మందికి.. అసలు షుగర్ టాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. అంతేకాదు 65 శాతం మందికి మెడిసిన్స్ డోసేజ్ చాలా మినిమైజ్ అయింది. అంటే వారికి షుగర్ వ్యాధి దాదాపు నియంత్రించబడింది. ప్రకృతి వైద్య విధానం షుగర్ నియంత్రణ, నిర్మూలనలో ప్రముఖ పాత్ర పోషిస్తుందని సశాస్త్రీయంగా నిరూపించడమే కాదు.. సగర్వంగా సమాజానికి తెలియచేసినట్లయింది. మన ప్రాంత ప్రకృతి వైద్య పితామహుడు మంతెన సత్యనారాయణ రాజుకే ఈ ఘనత దక్కుతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ పరిశోధన అందించిన స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని కృష్ణానది పక్కన కరకట్ట సమీపంలో నిర్మితమైన ‘డా.మంతెన సత్యనారాయణ రాజు’ ఆరోగ్యాలయంలో.. అహ్లాదకరమైన వాతావరణంలో, వేలాది మందికి షుగర్ వ్యాధిని నియంత్రణలోకి తీసుకొచ్చారు. ప్రతినెలా కనీసం వంద మంది అయినా రాజు గారు సూచించిన మార్గంలో డయాబెటిస్ కు గుడ్ బై చెబుతున్నారు. ఆరోగ్య సాధకుల కోరిక మేరకు ఆరోగ్యాలయంలో ‘స్పెషల్ డయాబెటిస్ క్యాంప్’ ప్రతి నెలా నిర్వహిస్తున్నారు. ప్రకృతి జీవన విధానం ద్వారా తమ షుగర్ వ్యాధిని తగ్గించుకోవాలని సంకల్పం తీసుకున్న వారికి ఉచితంగా సలహాలు, సూచనలు అందించేందుకు ఆరోగ్యాలయం స్వాగతం చెబుతోంది. సోమవారం నుంచి శనివారం వరకు ఔట్ పేషంట్(OP) విధానం ద్వారా ఉచితంగా షుగర్ తగ్గించుకునే మార్గాన్ని తెలియచెబుతున్నారు. ఈ రకంగా కూడా పైసా ఖర్చు లేకుండా షుగర్ మందులను తీసేస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లోని షుగర్ వ్యాధిగ్రస్తులు. మధుమేహం శిబిరం: ప్రతినెలా ఆరోగ్యాలయంలో ఇన్ పేషంట్ (IP) విధానంలో ప్రత్యేక శిభిరం ఉంటుంది. 30 రోజుల శిబిరం లో షుగర్ తగ్గించడానికి ప్రత్యేకమైన యోగాసనాలు, ప్రత్యేకమైన ఆహార నియమాలు, ప్రత్యేకమైన అవగాహన తరగతులు, ఇంటికి వెళ్ళిన తరువాత ఆచరించవలసిన జీవన విధానం పూర్తిగా నేర్పిస్తారు. ఈ శిబిరంలో చేరిన వారిలో సగం మందికి షుగర్ నియంత్రణలోకి వస్తోందని, మూడో వంతు మందికి టాబ్లెట్ అవసరం లేకుండా పోతోందని.. శిబిరం(IP)లో చేరిన ఆరోగ్య సాధకులు తమ అనుభవాల సారాన్ని ఆనందంగా చెబుతున్నారు. ప్రపంచ డయాబెటిస్ క్యాపిటల్, కేరాఫ్ గా మన తెలుగు రాష్ట్రాలు మారకుండా అలుపెరగని కృషి చేస్తున్న అవిశ్రాంత సాధకుడు మంతెన సత్యనారాయణ రాజు గారికి ప్రణమిల్లి పాదాభివందనం చేస్తున్నారు షుగర్ వ్యాధి బాధితులు. మతెన సత్యనారాయణ రాజు ఆరోగ్యాలయం: ఎటువంటి మందులు వాడకుండా ప్రకృతి జీవన, ప్రకృతి వైద్య విధానాల ద్వారా అన్నిరకాల ఆరోగ్య సమస్యలను నిర్మూలించడమే ఈ ఆరోగ్యాలయ లక్ష్యం. ఈ ఆరోగ్యాలయంలో ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య, నిపుణులు అనుభవజ్ఞుల సహకారంతో డా.మంతెన సత్యనారాయణరాజు ఆయన సతీమణి డా.విశాల గారి పర్యవేక్షణలో ప్రతీ ఆరోగ్యాభిలాషికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ప్రకృతి వైద్యవిధానం ఆధారంగా అనారోగ్యాన్ని నిర్మూలించడం, ఆరోగ్యాన్ని పరిరక్షించడం జరుగుతాయి. ఉచిత సలహాలకు అందుబాటులో డాక్టర్లు: మీ ఆరోగ్య సమస్య ఏదైనా, ఎలాంటి వ్యాధికి అయినా పరిష్కారం కావాలనుకుంటున్నారా.. డా. మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలోని ప్రముఖ నేచురోపతి డాక్టర్లు మీకు అందుబాటులో ఉంటారు. ఎలాంటి ఆహారం తీసుకుంటే మీ వ్యాధులు, అనారోగ్య సమస్యలు తగ్గి పోతాయి.. ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తారు... ప్రతి రోజు ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఫోన్ నెంబర్ 9848021122 కి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవచ్చు. దీంతో పాటు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలో ట్రీట్ మెంట్ వివరాలు తెలుసుకోవాలనుకుంటే 0863-2333888 కి ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8.30 గంటల మధ్య ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.🙏

Comments