Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Learn మణిద్వీప వర్ణన | Manidweepa Varnana: A Journey of Wonder в хорошем качестве

Learn మణిద్వీప వర్ణన | Manidweepa Varnana: A Journey of Wonder 1 год назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Learn మణిద్వీప వర్ణన | Manidweepa Varnana: A Journey of Wonder

Experience the wonder of Manidweepa Varnana in Telugu with this mesmerizing journey. Dive into the beauty and spirituality of this sacred text.#manidweepam #manidweepavarnana #devotionalsongs #geethanjali మణిద్వీప వర్ణన రాగం : హిందోళ తాళం : ఆది శృతి : 2 1\2 ( D Sharp ) రచన : శ్రీ శివకాశీ ఓం మణిద్వీప వాసిన్యై నమః ఓం శ్రీ లలితాంబికాయై నమః ఓం సర్వ శుభప్రదాయై నమః మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మణిద్వీపములో మంత్రరూపిణి మన మనసులలో కొలువైయుంది|| 1 || సుగంధ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణపూలు అచంచలంబగు మనోసుఖాలు మణి ద్వీపానికి మహానిధులు|| 2 || లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు|| 3 || పారిజాత వన సౌగంధాలు సురాధినాధుల సత్సంగాలు గంధర్వాదుల గాన స్వరాలు మణిద్వీపానికి మహానిధులు|| 4 || భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము || పద్మరాగములు సువర్ణమణులు పది ఆమడల పొడవున కలవు మధుర మధురమగు చందన సుధలు మణిద్వీపానికి మహానిధులు || 5 || అరువది నాలుగు కళామతల్లులు వరాలనొసగే పదారుశక్తులు పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు || 6 || అష్టసిద్ధులు నవనవ నిధులు అష్టదిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు || 7 || కోటి సూర్యుల ప్రచండకాంతులు కోటిచంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు జిలుగులు మణిద్వీపానికి మహానిధులు || 8 || భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము || కంచుగోడల ప్రాకారాలు రాగిగోడల చతురస్రాలు ఏడామడల రత్నరాశులు మణి ద్వీపానికి మహానిధులు || 9 || పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాధిపతులు మణి ద్వీపానికి మహానిధులు || 10 || ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపు కోటలు వైఢూర్యాలు పుష్యరాగమణి ప్రాకారాలు మణి ద్వీపానికి మహానిధులు || 11 || సప్తకోటి ఘన మంత్రవిద్యలు సర్వశుభప్రద ఇఛ్ఛాశక్తులు శ్రీ గాయత్రీ జ్ఞానశక్తులు మణి ద్వీపానికి మహానిధులు || 12 || భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము || మిలమిలలాడే ముత్యపు రాశులు తళతళలాడే చంద్రకాంతములు విద్యుల్లతలు మరకతమణులు మణిద్వీపానికి మహానిధులు || 13 || కుబేర ఇంద్ర వరుణదేవులు శుభాలనొసగే అగ్నివాయువులు భూమి గణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులు || 14 || భక్తి జ్ఞాన వైరాగ్యసిద్దులు పంచభూతములు పంచశక్తులు సప్తఋషులు నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు || 15 || కస్తూరి మల్లిక కుందవనాలు సూర్యకాంతి శిలమహాగ్రహాలు ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులు || 16 || భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము || మంత్రిణి దండిని శక్తిసేనలు కాళి కరాళి సేనాపతులు ముప్పది రెండు మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు || 17 || సువర్ణరజిత సుందరగిరులు అనంగ దేవీ పరిచారికలు గోమేధికమణి నిర్మిత గుహలు మణిద్వీపానికి మహానిధులు || 18 || సప్తసముద్రములనంత నిధులు యక్షకిన్నెర కింపురుషాదులు నానాజగములు నదీనదములు మణిద్వీపానికి మహానిధులు || 19 || మానవ మాధవ దేవగణములు కామధేనువు కల్పతరువులు సృష్టిస్థితిలయ కారణమూర్తులు మణిద్వీపానికి మహానిధులు || 20 || భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము || కోటి ప్రకృతుల సౌందర్యాలు సకలవేదములు ఉపనిషత్తులు పదారు రేకుల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు || 21 || దివ్య ఫలములు దివ్యాస్త్రములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్య జగములు దివ్య శక్తులు మణిద్వీపానికి మహానిధులు || 22 || శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనములు మణి నిర్మితమగు మండపాలు మణిద్వీపానికి మహానిధులు || 23 || పంచభూతములు యాజమాన్యాలు ప్రవాళసాలం అనేకశక్తులు సంతాన వృక్ష సముదాయాలు మణిద్వీపానికి మహానిధులు || 24 || భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము || చింతామణులు నవరత్నాలు నూరామడల వజ్రపు రాశులు వసంతవనములు గరుడపచ్చలు మణిద్వీపానికి మహానిధులు || 25 || ధుఃఖము తెలియని దేవీసేనలు నటనాట్యాలు సంగీతాలు ధనకనకాలు పురుషార్ధాలు మణిద్వీపానికి మహానిధులు || 26 || పదునాలుగు లోకాలన్నిటిపైన సర్వలోకమను లోకము గలదు సర్వలోకమే ఈ మణిద్వీపము సర్వేశ్వరికది శాశ్వతస్థానము || 27 || చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల మంచముపైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిద్వీపములో || 28 || భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము || మణిగణ ఖచిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణిద్వీపములో || 29 || పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్చించినచో అపారధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది || 30 || నూతన గృహములు కట్టినవారు మణిద్వీప వర్ణన తొమ్మిదిసార్లు చదివిన చాలు అంతా శుభమే అష్టసంపదల తులతూగేరు || 31 || శివకవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణిద్వీప వర్ణన చదివినచోట తిష్ఠ వేసుకొని కూర్చొనునంట కోటి శుభాలను సమకూర్చుటకై || 32 || భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము || *End Song Details* Manidweepa Varnana Slokas | Bhakti Songs మణి ద్వీప వర్ణన తెలుగులో | Mani Dweepa Varnana With Telugu Lyrics | Bhakthi Songs మణిద్వీప వర్ణన 9 సార్లు | Manidweepa Varnana | Manidweepa Varnana Slokas Manidweepa Varnana With Telugu Lyrics మణిద్వీప వర్ణన 9 సార్లు #divotionalsongs #bhaktibhajan #bhaktisongs #learning #singwithus #singasong #singing #telugusongs #geethanjalisongs #sangeetha#bhakti #bhaktibhajan #manidweepavarnana #bhaktisong #bhakisong2023 #devotionalsongs #devotinalvideos

Comments